ముగ్గురు భామలతో ఆడిపాడనున్న అల్లు అర్జున్

allu-arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో నటించిన ‘రేసు గుర్రం’ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. ఈ సినిమా జనవరిలోనే మొదలవ్వాలి కానీ కొన్ని అని వార్య కారణాల వల్ల ఇంకా మొదలు కాలేదు.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం త్వరలో మొదలు కానున్న అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాలో బన్ని సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారు. ఈ ముగ్గురిలో ఒక భామ సమంత కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాని సంబందించిన రెగ్యులర్ షూట్ ని మే లో మొదలు పెట్టి అక్టోబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడని సమాచారం.

గతంలో బన్ని – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’ సినిమా నిర్మించిన రాధా కృష్ణ నిర్మించనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కపోజ్ చేయనున్నాడు.

Exit mobile version