పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేస్తూ ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. పవర్‌స్టార్‌ను ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలని ఆశించారో డైరెక్టర్ సుజీత్ అలాగే చూపించడంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా OG మేనియాలో మునిగిపోతున్నారు.
ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో ఓజీ చిత్రాన్ని వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అల్లు అర్జున్ ఈ సినిమాపై తన రివ్యూ ఇస్తారా లేదా అనేది చూడాలి.
డివివి దానయ్య నిర్మించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాతో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.