అల వైకుంఠపురంలో టీమ్ సూపర్ హ్యాపీగా ఉంది. చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులనుండి పాజిటివ్ టాక్ రావడమే ఇందుకు కారణం. ఇక నేడు బన్నీ అభిమానులతో కలిసి అల వైకుంఠపురంలో మూవీ చూశారు. ఆర్ టి సి క్రాస్ రోడ్స్ నందు గల ఓ థియేటర్ లో బన్నీ సతీసమేతంగా అభిమానులతో కలిసి సినిమా చూశారు. దీనితో అక్కడి వాతావరణం కోలాహలంగా మారింది. బన్నీ ని చూడటానికి అభిమానులు ఎగబడ్డారు.
అల వైకుంఠపురంలో బన్నీ యాక్షన్ అండ్ డాన్సులు అభిమానులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ సినిమాకు బాగా కలిసొచ్చింది. పూజ హెగ్డే గ్లామర్ థమన్ సంగీతం చిత్రానికి చాలా ప్లస్ అయినదట. మొత్తానికి ఈ సంక్రాంతికి బన్నీ- త్రివిక్రమ్ ప్రేక్షకులకు ఓ పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ ఇచ్చారని తెలుస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. టబు, శుశాంత్, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, సముద్ర ఖని, జయరాం వంటి నటులు కీలక పాత్రలలో నటించారు.