రెండవ షెడ్యుల్లో అల్లు అర్జున్-త్రివిక్రమ్ చిత్రం

రెండవ షెడ్యుల్లో అల్లు అర్జున్-త్రివిక్రమ్ చిత్రం

Published on Dec 13, 2011 2:21 PM IST


త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుంది. ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్.రాధాకృష్ణ నిర్ముస్తుండగా డివివి దానయ్య సమర్పిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతుండగా ఇలియానా మొదటిసారి అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తుండగా సోనుసూద్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.

బ్రహ్మానందం మరియు ఇలియానా మీద కూకట్ పల్లి లోని హాస్పిటల్ సన్నివేశాలు చిత్రీకరించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ ఇద్దరు తమ పారితోషికం తగ్గించుకొని ఈ చిత్ర బడ్జెట్ తగ్గించే ప్రయత్నం చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు