బాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ క్రేజ్.. పుష్ప మేనరిజంతో అదరగొట్టిన జాన్వీ..!

Param Sundari

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప, పుష్ప 2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ సాధించాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాల్లో ఆయన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక మనదేశంలో కూడా పుష్ప మేనియా ఏ రేంజ్‌లో ఉండేదో మనం చూశాం. అయితే, బాలీవుడ్‌లో పుష్ప క్రేజ్ ఇప్పటికీ ఉందని చెప్పాలి.

తాజాగా బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘పరమ్ సుందరి’ అనే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్ర, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో జాన్వీ కపూర్ ‘ఆంధ్ర – తెలుగు అల్లు అర్జున్’ అంటూ ఆమె పుష్ప చిత్రంలోని మేనరిజం చేసి చూపెట్టింది.

ఇది నెట్టింట బాగా వైరల్ అవుతోంది. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సినీ స్టార్స్‌పై కూడా పుష్ప ఎలాంటి క్రేజ్ చూపెట్టాడో అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version