గిటార్ తో పోజ్ లు ఇచ్చిన స్టైలిష్ స్టార్

గిటార్ తో పోజ్ లు ఇచ్చిన స్టైలిష్ స్టార్

Published on Dec 19, 2012 2:55 AM IST

Allu-arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “ఇద్దరమ్మాయిలతో” చిత్రంలో మరింత స్టైలిష్ గా కనిపించనున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఈ మధ్యనే దాదాపు 60 రకాల కాస్ట్యూమ్స్ మీద ఫోటో షూట్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ నటుడు ఒక ఫోటో షూట్ కోసం గిటార్ తో పోజ్ లు ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రంలో అయన పాత్రతో పాటు గిటార్ కూడా ఉంటుందని సమాచారం. అమల పాల్ మరియు కేథరి తెరెసా లు ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటించనున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్ర చిత్రీకరణ త్వరలో మొదలు కానుంది. బ్యాంకాక్ మరియు న్యూజీల్యాండ్ లో అధిక భాగం చిత్రీకరణ జరుపుకోనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు