బన్నీ 2020లో మరోమారు దున్నేయడం ఖాయం

నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫలితం అల్లు అర్జున్ ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ సినిమాకోసం బన్నీ రియల్ సోల్జర్ గా కనిపించడం కోసం విపరీతంగా కష్టపడ్డారు. అంత కష్టపడితే ఫలితం మాత్రం దెబ్బేసింది. దీనితో ఆయన ఏడాది పాటు ఏ దర్శకుడితో, ఎలాంటి సబ్జెక్టుతో సినిమా చేయాలనే సందిగ్ధంతో పడ్డారు. చివరకు త్రివిక్రమ్ వైపు మొగ్గుచూపి ఆయన అల వైకుంఠపురంలో మూవీ చేయగా, అది ఆయన ఊహించిన దానికి మించిన విజయం కట్టబెట్టింది. ఇదే జోష్ లో బన్నీ తన తదుపరి చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

బన్నీ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఐతే ఈ చిత్రంలో బన్నీ రోల్ భిన్నంగా మాస్ అండ్ డీగ్లామర్ రోల్ కానుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నాడంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కేరళలో ఓ షెడ్యూల్ పూర్తికాగా సెకండ్ షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. ఈ ఏడాది దసరా బరిలో ఈ చిత్రం దిగనుందని తెలుస్తుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం 2020లో విడుదలై మళ్ళీ బన్నీ రికార్డ్స్ దున్నేయడం ఖాయం అని చెవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రశ్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.

Exit mobile version