బాలివుడ్ భామలు కత్రిన కైఫ్ మరియు కరీనా కపూర్ ల తో కలిసి అల్లు అర్జున్ వేదిక ను పంచుకోబోతున్నారు. కొచ్చి లో ఏమ్మాన్యుయాల్ స్టోర్ ని ఓపెన్ చెయ్యటానికి కత్రిన మరియు కరీనాలతో పాటు అల్లు అర్జున్ కి కూడా ఆహ్వానం అందింది. మార్చ్ 25న ఈ స్టోర్ ని ప్రారంభించబోతున్నారు. కేరళ లో అల్లు అర్జున్ కి ఉన్న పేరు మూలంగా ఈ ఆహ్వానం వచ్చినట్టు తెలుస్తుంది రెండు సంవత్సరాల క్రిందట ఒకానొక మలయాళం ఛానల్ అల్లు అర్జున్ కి “యూత్ ఐకాన్” అనే బిరుదుని ఇచ్చింది. ఈ స్టోర్ ని ఓపెన్ చెయ్యటానికి అల్లు అర్జున్ కి పెద్ద మొత్తం లో డబ్బు చెల్లించినట్టు తెలుస్తుంది కేరళ లో అల్లు అర్జున్ కి ఉన్న ప్రాచుర్యానికి ఇదొక ఉదాహరణ. అక్కడ డబ్ అయిన “బద్రీనాథ్” మరియు “ఆర్య-2” వంటి చిత్రాలు అద్బుతమయిన ఓపెనింగ్స్ రాబట్టాయి.. త్వరలో నేరుగా మలయాళం చిత్రం చెయ్యటానికి అల్లు అర్జున్ సిద్దమవుతున్నారు