మలయాళంలో చరణ్ కి సాయం చేసిన అల్లు అర్జున్

Charan-and-arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. బన్ని సినిమాలకు కేరళలో మంచి రెవిన్యూ వస్తుంది. మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న తెలుగు హీరో అల్లు అర్జున్ మాత్రమే. తన ఇమేజ్ అనుకోని విధంగా ఇప్పుడు రామ్ చరణ్ కి బాగా హెల్ప్ అయ్యింది.

గతంలో కూడా రామ్ చరణ్ కేరళలో తన మార్కెట్ పెంచుకోవడానికి ట్రై చేసాడు కానీ అది సక్సెస్ కాలేదు. కానీ ‘ఎవడు’ సినిమాతో అది మారిపోయింది. ‘భయ్యా’ అనే పేరుతో మలయాళంలో రిలీజ్ అయిన ‘ఎవడు’ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఉండడం వల్ల కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకోవడం ఎకాకుండా కేరళలో 1 కోటి మార్క్ ని క్రాస్ చేసింది.

ఈ విషయంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

Exit mobile version