త్వరలో రానున్న ‘జులాయి’ ప్రోమోషనల్ సాంగ్

త్వరలో రానున్న ‘జులాయి’ ప్రోమోషనల్ సాంగ్

Published on Jul 15, 2012 8:45 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ కలయికలో తెరకెక్కిన ‘జులాయి’ చిత్రం ప్రోమోషనల్ సాంగ్ ని జూలై నాలుగో వారంలో విడుదల చేయనున్నారు. పక్డో పక్డో అనే ప్రోమోషనల్ సాంగ్ ని పూర్తిగా హైదరాబాద్లోనే చిత్రీకరించారు. ఈ ప్రోమోషనల్ సాంగ్ యొక్క ఫస్ట్ లుక్ ని దేవీ శ్రీ ప్రసాద్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అల్లు అర్జున సరసన ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరియు సోనుసూద్ లు కీలక పాత్రలు పోషించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఆగష్టు 9న సౌత్ ఇండియా మొత్తం భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు