‘జులాయి’ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి మరియు మరికొద్ది రోజుల్లో భారీ ఎత్తున ప్రచారం మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ మరియు దేవీ శ్రీ ప్రసాద్ ల మీద ఒక ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. అల్లు అర్జున్ మరియు దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాటలో మొదటిసారి కలిసి స్టెప్పు లేసారు మరియు మొదటిసారి ఇలాంటి ఒక ప్రత్యేకమైన పాట చేయడంతో అల్లు అర్జున్ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ ప్రమోషనల్ సాంగ్ ని హైదరాబద్లో చాలా ఘనంగా ఏర్పాటు చేసిన వేడుకలో విడుదల చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్. రాధాకృష్ణ నిర్మించారు. అల్లు అర్జున్ మరియు ఇలియానా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.