బన్నీ – కొరటాల కాంబో కూడా గట్టి ప్లానే చేసారా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బన్నీ పాన్ ఇండియన్ ఎంట్రీ “పుష్ప” తో రెడీ అయ్యిపోయింది. బన్నీ హ్యాట్రిక్ కాంబో సుకుమార్ తో తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ తో బన్నీకు బాలీవుడ్ లో ఖచ్చితంగా గ్రాండ్ వెల్కమ్ ఖాయం అనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అలాగే దీని తర్వాత కూడా బన్నీ ఇంకా ఇది లైన్ లో ఉండగానే బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ కొరటాల శివతో కూడా మరో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసేసి మరోసారి సినిమా ఇండియా వైడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి కూడా లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

పుష్ప ను బాలీవుడ్ లో కూడా విడుదల చేస్తున్నప్పటికీ క్యాస్టింగ్ మాత్రం ఎక్కువగా మనదే ఉంది. కానీ కొరటాల ప్రాజెక్ట్ ను మాత్రం గట్టిగానే ప్రణాళికలు వేస్తున్నారట. అందులో భాగంగానే అప్పుడే ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ కు సంబంధించి పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి కొరటాల ఏఈ చిత్రాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి.

Exit mobile version