అల్లు అర్జున్ కూతురు అర్హ అస్సలు మాట వినడం లేదు. ఎన్ని సార్లు అడిగినా నో అని చెవుతుంది. మరి ఏ విషయంలో అర్హ వాళ్ళ నాన్న మాట వినడం లేదనేగా మీ సందేహం. అదే అర్హ పెళ్లి గురించి.. అల్లు అర్జున్ అర్హను ఎప్పటి నుండో నాన్న చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకో అని అడుగుతుండగా… అర్హ మాత్రం చేసుకోను అని ఖరా కండీగా చెప్పేస్తుంది. బన్నీ పాపం 374సార్లు అడిగినా అర్హ సమాధానం మాత్రం అదే నట. ఈ తండ్రి కూతుళ్ళ అల్లరి వీడియో మరోమారు అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక కొద్దిరోజుల్లో అల్లు అర్జున్ పుష్ప మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు. షూటింగ్స్ కి అనుమతి వచ్చిన నేపథ్యంలో పుష్ప మూవీ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ గా డీ గ్లామర్ రోల్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.