ప్రస్తుతం కామెడీ హీరోలు కరువవుతున్న కాలంలో ఆ హోదాని మోస్తూ కామెడీ కింగ్ గా వెలుగొందుతున్న అల్లరి నరేష్ కొత్త చిత్రం ప్రారంభమైంది. సోషియో ఫాంటసీగా తెరకెక్కనున్న చిత్రానికి సంభందించిన ముహూర్త కార్యక్రమాలు రామోజీ ఫిలిం సిటీలో జరిగాయి. అల్లరి నరేష్ సరసన రిచా పనై అనే కొత్త హీరొయిన్ నటించనున్న ఈ చిత్ర ముహూర్త వేడుకకి దర్శకరత్న దాసరి నారాయణ రావు, మూవీ మొఘల్ డి. రామానాయుడు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. చంటి అద్దాల నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎ. సత్తిబాబు దర్శకత్వం వహించనున్నారు. నరేష్ కేరేర్ర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఎమ్.ఎస్ నారాయణ, గిరి బాబు మరియు ఇతర నటులు కీలక పాత్రలు పోషించనున్నారు.