అమెజాన్ ప్రైమ్ లో మరో తెలుగు సినిమా ?

అమెజాన్ ప్రైమ్ లో మరో తెలుగు సినిమా ?

Published on Oct 10, 2020 8:16 PM IST


అల్లరి నరేష్ ప్రస్తుతం చేస్తోన్న ప్రయోగాత్మక చిత్రం ‘నాంది’. కాగా ఈ సినిమాని జీ5 ఓటీటీ సంస్థ పెద్ద మొత్తానికి కొనుగోలు చేసినట్టు ఇటివలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి మరో అప్ డేట్ తెలిసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని.. డిసెంబర్ లో రిలీజ్ ఉండొచ్చు అని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈ నెలలో షూటింగ్ ను ఫినిష్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇక అల్లరి నరేష్ కూడా ఈ సినిమా తనకు గత వైభోగం తెస్తోందని బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. అందుకే పోలీస్ స్టేషన్ సన్నివేశాల్లో పూర్తిగా నగ్నంగా కనిపించడానికి కూడా అంగీకరించి మరి ఆ సన్నివేశాల్లో నటించాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్ కి కూడా విపరీతమైన స్పందన రావడం ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. కెరీర్ లో ఎక్కువగా కామెడీ జానర్లో సినిమాలు చేసి తనకంటూ ఓ మిడియమ్ రేంజ్ మార్కెట్ సృష్టించుకున్న అల్లరి నరేష్.. కెరీర్ మొదట్లోనే నేను, ప్రాణం సినిమా లాంటి ఇంటెన్స్ చిత్రాలను కూడా చేశాడు. మరి ఇప్పుడు ఇలాంటి సినిమాతో నరేష్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

తాజా వార్తలు