అల్లరి నరేష్ ‘నాంది’ సెన్సార్ పూర్తి !

అల్లరి నరేష్ ‘నాంది’ సెన్సార్ పూర్తి !

Published on Feb 13, 2021 10:53 PM IST

అల్లరి నరేష్ తాజాగా చేస్తోన్న ప్రయోగాత్మక చిత్రం ‘నాంది’. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A’ సర్టిఫైతో ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. ఇక అల్లరి నరేష్ కూడా ఈ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. అందుకే పోలీస్ స్టేషన్ సన్నివేశాల్లో పూర్తిగా నగ్నంగా కనిపించడానికి కూడా అంగీకరించాడు.

కాగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. కెరీర్ లో ఎక్కువగా కామెడీ జానర్లో సినిమాలు చేసి తనకంటూ ఓ మిడియమ్ రేంజ్ మార్కెట్ సృష్టించుకున్న అల్లరి నరేష్.. కెరీర్ మొదట్లోనే నేను, ప్రాణం సినిమా లాంటి ఇంటెన్స్ చిత్రాలను కూడా చేశాడు. మరి ఇప్పుడు ఇలాంటి సినిమాతో నరేష్ ఎలా హిట్ కొట్టగలడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు