షూటింగ్ పూర్తైన అల్లరోడి కెవ్వు కేక

షూటింగ్ పూర్తైన అల్లరోడి కెవ్వు కేక

Published on May 16, 2013 8:22 AM IST

Kevvu-Keka

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ‘కెవ్వు కేక’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఆడియో త్వరలోనే రిలీజ్ చేస్తారని అంచనా వేస్తున్నారు, ఆలాగే ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాని జూన్ తర్వాత రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. షర్మిలా మాండ్రే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీ ప్రసాద్ డైరెక్టర్. జాహ్నవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి చిన్ని చరణ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. నందమూరి హరి ఎడిటర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి విజయ్ కుమార్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా కూడా అల్లరి నరేష్ స్టైల్లో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు