కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటిస్తున్న 3D చిత్రం ‘యాక్షన్’ ప్రస్తుతం కోకాపేటలో షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాదులోని జూ పార్కులో నిన్న కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకున్న చిత్ర యూనిట్ ఈ రోజు కోకాపేటకి మారింది. దూకుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన నిర్మాత అనిల్ సుంకర దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న మొదటి చిత్రం యాక్షన్. కిక్ శ్యాం, వైభవ్ మరియు రాజు సుందరం ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బప్ప లహరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.