చిరిగి చాటంత అవుతుంది అంటున్న అల్లరోడు

చిరిగి చాటంత అవుతుంది అంటున్న అల్లరోడు

Published on Nov 6, 2012 12:11 PM IST


కామెడీ కింగ్ అల్లరి నరేష్ మన చేత కేక పుట్టించడాని చేస్తున్న సినిమా ‘కెవ్వు కేక’. ఇందులో తను ఏ పని తలపెట్టినా ‘చిరిగి చాటంత అవుతుంది’ అని అంటూ ఉంటాడు. అంతే కాదు అతను చేసే పనులు కూడా అలానే ఉంటాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దేవీ ప్రసాద్ మాట్లాడుతూ ‘ నేను ఇదివరకే నరేష్ తో కలిసి చేసిన ‘బ్లేడ్ బాబ్జీ’ సినిమా తార్వాత మాలీ కలిసి పని చెయ్యలేదు. ఇప్పుడు తనతో పనిచేస్తూ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. మూవీ కూడా టైటిల్ కి తగ్గట్టుగానే ఉంటుందని’ అన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని బొప్పన్న చంద్ర శేఖర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్ తో కలిసి ప్రముఖ కమెడియన్స్ ఎం.ఎస్ నారాయణ, ధర్మవరపు మరియు అలీ సందడి చేయనున్నారు. నరేష్ సరసన షర్మిల మాంద్రే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి చిన్ని చరణ్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు