హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో “సింధూర సంజీవని” మెగా రక్తదాన శిబిరం

Hero Krishna Manineni

జెట్టి సినిమాతో హీరోగా గుర్తింపు పొందిన కృష్ణ మానినేని, సేవా దృక్పథంతో గత ఎనిమిదేళ్లుగా 100 డ్రీమ్స్ సేవా సంస్థ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా, విజయవాడ వరదల సమయంలో చేసిన సేవా కార్యక్రమాలకు కృష్ణ మానినేని విశేష ప్రశంసలు అందుకున్నారు.

జూన్ 14 – ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా, “సింధూర సంజీవని” పేరిట చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 251 మంది దాతలు రక్తదానం చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమానికి చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు స్వామి నాయుడు, 100 డ్రీమ్స్ వాలంటీర్లు, మెగాస్టార్ & పవర్ స్టార్ అభిమానులు, పంచ్ ప్రసాద్, జబర్దస్త్ రాము, ఎం. రవికుమార్, విజయ్ భాస్కర్, సత్యదేవ్, మహేష్ బాబు, బాలకృష్ణ, కిషోర్ కౌతారపు, గౌతమ్ తదితరులు హాజరయ్యారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా కృష్ణ మానినేని ముందుకు సాగుతున్నారు. రక్తదానం వంటి మహత్తర కార్యక్రమాల్లో యువత ముందుండాలని ఆయన ఆకాంక్షించారు.

Exit mobile version