మరో తమిళ రీమేక్ పై కన్నేసిన అల్లరి నరేష్??

మరో తమిళ రీమేక్ పై కన్నేసిన అల్లరి నరేష్??

Published on Dec 19, 2012 1:43 AM IST

Allari-Naresh
అల్లరి నరేష్ మరో తమిళ రీమేక్ చిత్రంలో నటించనున్నారని సమాచారం. “నడవుల కొంజెం పక్కత్త కానం” అన్న పేరుతో తమిళంలో మంచి విజయం సాదించిన ఈ చిత్రాన్ని తెలుగు అల్లరి నరేష్ రీమేక్ చేయ్యనున్నారని సమాచారం. బాలాజీ ధరనిధరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ ప్రేమ కుమార్ జీవితంలో జరిగిన నిజమయిన సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. పెళ్లికి ముందు రోజు తలకు గాయం అయ్యి గతం మరిచిపోయిన ఒక కురాడి కథను హాస్య మిలితంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తే అల్లరి నరేష్ సరిగ్గా సరిపోతాడని విమర్శకులు చెప్పారు. ఈ మధ్యనే “సుడి గాడు” వంటి రీమేక్ చిత్రంతో విజయాన్ని దక్కించుకున్న ఈ నటుడు మరో రీమేక్ చెయ్యడానికి సిద్డంయ్యడనే పరిశ్రమ వర్గాలు తెలుపుతున్నారు. అధికారికంగా ఏది తెలియరాలేదు ప్రస్తుతం ఈ నటుడు “కెవ్వు కేక” చిత్రీకరణలో ఉన్నారు. త్వరలో “యముడికి మొగుడు” చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు