అల్లరి నరేష్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘12A రైల్వే కాలనీ’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. నాని కసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమాక్షీ భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్ర రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లరి నరేష్ మీమర్స్‌తో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా నరేష్ తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘సుడిగాడు’ చిత్రానికి సీక్వెల్‌పై మాట్లాడారు. సుడిగాడు 2 ప్రస్తుతం రైటింగ్ స్టేజ్‌లో ఉందని.. మొదటి భాగంలో 100 సినిమాలను ప్యారడీ చేశామని.. ఈసారి దానికి డబుల్ ఉంటుందని తెలిపాడు. పాన్-ఇండియా సినిమాలపై స్పూఫ్స్ ఉంటాయని నరేష్ తెలిపారు.
సుడిగాడు సీక్వెల్‌లో యానిమల్, పుష్ప 2 వంటి పాన్-ఇండియా చిత్రాలపై స్పూఫ్స్ జోడించాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. స్క్రిప్ట్ ఇంకా డెవలప్ అవుతోంది కాబట్టి సమయం పడుతుందని.. సుడిగాడు 2 షూట్ 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.


