రవితేజ ఎన్నో ఆశలతో చేస్తున్న చిత్రం ‘డిస్కో రాజా’. విఐ అనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్స్ బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇకపోతే చిత్ర బృందం ప్రీరిలీజ్ వేడుకకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న హైదరాబాద్ నగరంలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది.
ఇకపోతే ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రేక్షకులకు అందివ్వనున్నారు. ఇందులో నాభ నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్ కథానాయికలుగా నటించారు. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండగా బాబీ సింహ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. దర్శకుడు విఐ ఆనంద్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుందని, అది ప్రేక్షకులు నమ్మేలా, వాస్తవానికి దగ్గరగా ఉంటుందని, సినిమా ఒక లాజికల్ ఫన్ రైడ్ అని చెప్పుకొచ్చారు.