సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కి, నటీనటులకి, టెక్నీషియన్స్ కి మధ్య చిన్న చిన్న గొడవలు రావడం అనేది చాలా కామన్ గా జరుగుతుంది. అవి ఎప్పటికీ ఆపలేం, అలాగే ఇవి సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
తాజాగా నిన్ననే జరిగిన లెజెండ్ సక్సెస్ మీట్ లో బోయపాటి శ్రీను – దేవీశ్రీ ప్రసాద్ మధ్య చిన్న మనస్పర్దల వాతావరణం కనిపించింది. బోయపాటి శ్రీను మాట్లాడినప్పుడు దేవీశ్రీ ప్రసాద్ మైక్ తీసుకొని తను చెప్పిన కొన్ని కామెంట్స్ ని కొట్టిపారేశారు. దాంతో ఈ విషయం పబ్లిక్ లోకి కాస్త నెగటివ్ గా వెళ్ళింది.
ఈ విషాయపై టీవీ చానల్స్ కూడా ఈ విషయంపై స్పెషల్ షౌస్ చేస్తున్నారు. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పడానికి బోయపాటి శ్రీబు, దేవీశ్రీ ప్రసాద్ కలిసి ఈ రోజు రేసు గుర్రం సినిమా చూసారు, అలాగే దానికి సంబందించిన ఫోటోలను పబ్లిచ్క్ లోకి వదిలారు.
వారు విడుదల చేసిన ప్రెస్ నాట్ ని బట్టి చూస్తే వాళ్ళిద్దరి మధ్యా అంతా ఆల్ ఈజ్ వెల్ అయినట్టు అనిపిస్తోంది. అలాగే బోయపాటి – దేవీశ్రీ కలిసి తదుపరి సినిమాకి పనిచేయనున్నారు.


