ఈ నెల 23న ఆల్ ఇండియా సినిమా బంద్?

ఈ నెల 23న ఆల్ ఇండియా సినిమా బంద్?

Published on Feb 2, 2012 9:45 AM IST

ఈ నెల 23న ఒకరోజు పాటు దేశ వ్యాప్తంగా బంద్ పాటించాలని యోచనలో ఉంది.ఈ మేరకు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఒక లేఖ రాసి వివిధ సంఘాలకు పంపడం జరిగింది. ఇప్పటికే పరిశ్రమ ఆర్ధిక నష్టాలు మరియు పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఇవికాక సేవా పన్ను అదనంగా కట్టాలంటే మరింత సమస్య ఎదురవుతుందని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రవి.కె అన్నారు. సౌత్ ఇండియా ఫిలిం ఆఫ్ కామర్స్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కేసు వేయాలనే ఆలోచనలో ఉంది. హిందీ చిత్ర సీమలో ఉన్న నిర్మాతలు మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

తాజా వార్తలు