అందరి కళ్ళూ ఆ ఆడియో లాంచ్ పైనే

Rey-New-Posters-(1)
వై.వి.ఎస్ చౌదరి తెరకెక్కించిన రేయ్ సినిమా ఫిబ్రవరి 5న మనముందుకు రానుంది. అయితే ఇప్పుడు అందరికళ్లూ జనవరి 17న శిల్పకళావేదికలో జరగన్న ఆడియో లాంచ్ పై వున్నాయి. ఎందుకంటే ఈ వేడుకకు పవన్ కల్యాణ్ ముఖ్యఅతిధిగా రానున్నాడు, చాలా రోజులతరువాత పవన్ వేడుకకు హాజరై అభిమానులను అలరించనున్నాడు. తన మేనల్లుడైన సాయి ధరంతేజ్ కోసమే ఈ వేడుకకు వస్తున్న సంగతి తెలిసినదే

ఈ సినిమాలో సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ హీరోయిన్స్. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో సాయి నృత్య భంగిమలు అలరించాయి. జమైకాలో డ్యాన్సర్ పాత్రను ఈ సినిమాలో సాయి పోషించాడు. కరేబియన్ దీవుల నడుమ ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. చౌదరి గారే ఈ సినిమాకు దర్శకనిర్మాత. చక్రీ సంగీత దర్శకుడు

Exit mobile version