మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న అవైటెడ్ సినిమా పెద్ది కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి చికిరి చికిరి అంటూ ప్లాన్ చేసిన ఫస్ట్ సింగిల్ ప్రోమో క్రేజీ ట్రీట్ ఇచ్చింది.
ఇక నేడు ఫుల్ సాంగ్ విడుదల కానుండగా ఈ సాంగ్ సాంగ్ కోసమే ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ ట్యూన్, రామ్ చరణ్ గ్రేస్ అలానే బుచ్చిబాబు టేకింగ్ ఎలా ఉంటాయో చూడాలని వారంతా ఆసక్తిగా ఉన్నారు. మరి అది తెలియాలి అంటే ఇంకొంతసేపు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకి వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది మార్చ్ 27న విడుదల కాబోతోంది.
