మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “వార్ 2”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమాలో ఇద్దరు డాన్సింగ్ డైనమైట్స్ నడుమ డాన్స్ వార్ కూడా జరిగితే ఎలా ఉంటుందో అనేది కూడా మొదటి నుంచీ మంచి ఆసక్తిగా ఉంది.
ఇలా ఫైనల్ గా ఈ బిగ్ డేట్ రానే వచ్చింది. దీనితో హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ నడుమ సాగే సాంగ్ కోసం అభిమానులు సహా జెనరల్ ఆడియెన్స్ కూడా వార్ 2 నుంచి రానున్న నేటి సాంగ్ కోసం ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సాంగ్ లో ఇద్దరు హీరోలు చేసే డాన్స్ మూమెంట్స్ ఎలా ఉంటాయో అని ఆలోచిస్తున్నారు. మరి మేకర్స్ ఏం ప్లాన్ చేసారో తెలియాలి అంటే ఇంకొంతసేపు ఆగాల్సిందే.