యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే ‘థగ్ లైఫ్’. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రంలో కమల్ సహా త్రిష, శింబు ఇంకా అనేకమంది టాలెంటెడ్ నటులు భాగం కాగా ఈ చిత్రం ప్రమోషన్స్ ఇపుడు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి.
అయితే ఈ చిత్రం కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి సహా ఈ స్పెషల్ కాంబినేషన్ కోసం చూస్తున్న జెనరల్ ఆడియెన్స్ కి ఒక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇపుడు వరకు వచ్చిన పాటలు, టీజర్స్ తో సినిమా నేపథ్యం ఇతర అంశాలు గోప్యంగానే ఉన్నాయి. ఇవన్నీ ట్రైలర్ చూస్తే తప్ప ఒక క్లారిటీ వచ్చేలా లేదు. అందుకే ఈ ట్రైలర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఫైనల్ గా ఈ ట్రైలర్ రిలీజ్ కి టైం లాక్ అయ్యింది.
ఈరోజు మే 17 సాయంత్రం 5 గంటలకి ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్టుగా ఇపుడు మేకర్స్ అనౌన్స్ చేసేసారు. అన్ని భాషల్లో కూడా ఇదే సమయానికి ట్రైలర్ రానుంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అలాగే మద్రాస్ టాకీస్ వారు నిర్మాణం వహించారు. జూన్ 5న ఈ చిత్రం విడుదల కాబోతుంది.