పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులుకి ఇది బిగ్ డే అని చెప్పవచ్చు. తను నటించిన అవైటెడ్ సినిమా అది కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా అందులోని స్ట్రెయిట్ చిత్రం హరిహర వీరమల్లు తాలూకా ట్రైలర్ కంటెంట్ రాబోతోంది. మేకర్స్ ఎన్నో ఏళ్ళు శ్రమించి చేసిన ఈ సినిమాపై ఇప్పుడిప్పుడే మళ్లీ కొంచెం హైప్ వస్తుంది.
అయితే నేడు రాబోతున్న ట్రైలర్ పట్లే అన్ని అంచనాలు ఉన్నాయి. మేకర్స్ ట్రైలర్ పై నిన్నటి నుంచే గట్టి హైప్ కూడా ఎక్కిస్తున్నారు. ఇలా ఎట్టకేలకు ఆ బిగ్ డే కూడా వచ్చేసింది. థియేటర్స్ లో ప్లాన్ చేసిన ఈ ట్రైలర్ చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సహంగా కూడా ఉన్నారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే ఏ ఎం రత్నం నిర్మాణం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.