‘రామాయణ’ గ్లింప్స్.. ఇండియన్ సినిమా నుంచి కొత్త చరిత్ర కాబోయేలా

‘రామాయణ’ గ్లింప్స్.. ఇండియన్ సినిమా నుంచి కొత్త చరిత్ర కాబోయేలా

Published on Jul 3, 2025 12:42 PM IST

మన దేశపు చరిత్రలో మహాకావ్యం రామాయణం కోసం ఎన్ని సినిమాలు తీసిన ఎన్ని తరాలలో తీసిన కూడా అదే రీతి ఆదరణ అందుకుంటుంది. ఇలా ఆల్రెడీ ఈ మధ్యనే ఆదిపురుష్ అనే సినిమా వచ్చినప్పటికీ మళ్ళీ రామాయణం నేపథ్యంలోనే అనౌన్స్ చేసిన నితీష్ తివారి రామాయణ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరి ఈ సినిమా నుంచి అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైటిల్ గ్లింప్స్ ని మేకర్స్ విడుదల చేసారు. అయితే ఈ గ్లింప్స్ మాత్రం ఒక ఎపిక్ లా ఉందని చెప్పడంలో సందేహమే లేదు. కేవలం బిగ్ స్క్రీన్ పై మాత్రమే చూడగలిగే కొత్త ఎక్స్ పీరియన్స్ ని మేకర్స్ అయితే ఈ గ్లింప్స్ తో ప్రామిస్ చేస్తున్నారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ రామునిగా, సాయి పల్లవి సీతగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణ పాత్రలో అలాగే హనుమాన్ పాత్రలో సన్నీ డియోల్ లని అనౌన్స్ చేయగా ఇందులో రణబీర్, యష్ లపై చూపించిన విజువల్స్ అయితే మైండ్ బ్లాకింగ్ గా ఉన్నాయని చెప్పాలి. ఇంకా హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ అలాగే ఏ ఆర్ రెహ్మాన్ లు ఇచ్చిన స్కోర్ గాని పూర్తిగా ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ ని చూపిస్తున్నాయి.

ఇక ఫైనల్ గా రామునిగా రణబీర్ ని రావణునిగా యష్ ని చూపించిన ఆ కొన్ని చిన్న ఫ్రేమ్స్ కూడా థియేటర్స్ లో ముఖ్యంగా మన ఇండియన్ సినిమా నుంచి ప్రపంచ సినిమాకి ఒక కొత్త చరిత్రకి నాంది పలికేలా సూచిస్తున్నాయి. మొత్తానికి మాత్రం ఈ స్పెషల్ ప్రాజెక్ట్ పై ఈ గ్లింప్స్ తో అంచనాలు మరింత లెవెల్లోకి పెరిగిపోయాయి. మరి బిగ్ స్క్రీన్స్ పై ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే మొదటి భాగం కోసం వచ్చే ఏడాది దీపావళి వరకు ఆగక తప్పదు. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నమిత్ మల్హోత్రా నిర్మాణం వహిస్తున్నారు.

రామాయణ గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు