యూఎస్ ప్రీమియర్లో కలెక్షన్స్ లో సత్తా చాటిన బన్నీ

యూఎస్ ప్రీమియర్లో కలెక్షన్స్ లో సత్తా చాటిన బన్నీ

Published on Jan 12, 2020 4:16 PM IST

బన్నీ అల వైకుంఠపురంలో మూవీ నేడు విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. గత రాత్రి నుండి యూఎస్ ప్రీమియర్స్ చూసిన వారందరూ సినిమాపై పాజిటివ్ టాక్ సోషల్ మీడియా వేదికగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ లో అల వైకుంఠపురంలో మూవీ రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం $ 8లక్షల డాలర్ల వసూళ్లు సాధించింది. సాధారణంగా యూఎస్ లో త్రివిక్రమ్ సినిమాలకు చాల డిమాండ్ ఉంటుంది. బన్నీ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీ కావడంతో, ఈ చిత్రంపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ప్రీమియర్స్ ద్వారానే వన్ మిలియన్ వసూళ్లకు దగ్గరైన ఈ చిత్రం రికార్డు వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించారు. టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ ఇతర కీలక పాత్రలు చేయడం జరిగింది. అల వైకుంఠపురంలో చిత్రానికి సంగీతం థమన్ అందించారు.

తాజా వార్తలు