స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ దుమ్ము దులుపుతుంది. బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులందరికీ ఈ సినిమా బాగా నచ్చడంతో సంక్రాంతి విన్నర్ అనే బిరుదు కూడా రిలీజ్ రోజే దక్కించుకుంది. కాగా ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ లలో కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తూ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటేసింది.
విడుదల అయిన మొదటి రోజున, ఈ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆస్ట్రేలియాలో మొత్తం 28 లొకేషన్స్ లో a$ 257,122 వసూలు చేసింది. అలాగే ఆస్ట్రేలియాలో ఆల్-టైమ్ టాప్ తెలుగు సినిమా ప్రీమియర్ వసూళ్ల జాబితాలో బాహుబలి 2, సాహో తరువాత ‘అల వైకుంఠపురములో’ మూడో ప్లేస్ లో నిలిచింది. మరోవైపు, న్యూజిలాండ్‌లో కూడా ప్రీమియర్స్ నుండి $ 35,800 వసూలు చేసింది. మొత్తానికి బన్నీ కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ కలెక్షన్స్ రాబడుతుంది.