పూర్తయిన మనం మూవీ సెకండ్ షెడ్యూల్

పూర్తయిన మనం మూవీ సెకండ్ షెడ్యూల్

Published on Jul 31, 2013 6:19 PM IST

manam

అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోలు కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘మనం’. ఈ సినిమాకి సంబందించిన సెకండ్ షెడ్యూల్ ఈ రోజుటితో ముగిసింది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య లు ముగ్గురు తెరపై కనిపించి ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సమంత, నాగార్జున సరసన శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి హర్ష వర్ధన్ కథ, డైలాగ్స్ ని అందిస్తున్నాడు.

తాజా వార్తలు