అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని మల్టీ స్టారర్ చిత్రం

అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని మల్టీ స్టారర్ చిత్రం

Published on Oct 8, 2013 8:30 PM IST

Manam

అక్కినేని వంశంలో మూడు తరాల నటులు కలిసినటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘మనం’. ప్రస్తుతం ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసాక సినిమా పై ప్రజలలో ఆసక్తి మరింత పెరిగింది

ఫిలింనగర్ సమాచారం ప్రకారం నాగచైతన్య, సమంత ల జంటకు నాగార్జున వారసుడు అంట. నాగార్జున మరియు శ్రేయ జంటకు వారసుడే నాగేశ్వరరావట. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ఈ సినిమాను తెరకేక్కిస్తున్నారట

విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హర్షవర్ధన్ సంబాషణలు అందిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ సౌజన్యంతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు