ఆ పాట కోసం చైతూ ఫ్యాన్స్ వెయిటింగ్

ఆ పాట కోసం చైతూ ఫ్యాన్స్ వెయిటింగ్

Published on Mar 11, 2020 10:47 AM IST

నాగ చైతన్య హీరోగా ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై అక్కినేని అభిమానులలో విపరీతమైన ఆసక్తి నెలకొనివుంది. ఈమూవీలో చైతూ లుక్ కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తుండగా, సాయి పల్లవి తో ఆయన కెమిస్ట్రీ హైలెట్ గా నిలిస్తుందనిపిస్తుంది. కాగా నేడు ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ఏయ్.. పిల్లా విడుదల కానుంది.

ఏయ్ పిల్లా సాంగ్ నేటి సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదల అవుతుండగా, అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లవ్ స్టోరీ మూవీకి సంగీతం ప్రవీణ్ సి హెచ్ అందిస్తున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్ మోహన్ రావ్ లవ్ స్టోరీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య ఈ మూవీలో మిడిల్ క్లాస్ డ్రెప్రెస్సివ్ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. లవ్ స్టోరీ మూవీ ఏప్రిల్ 2న విడుదల కానుంది.

తాజా వార్తలు