అక్ష ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న “అఖిల”

అక్ష ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న “అఖిల”

Published on Sep 11, 2020 8:51 PM IST


అక్ష లీడ్ రోల్ లో, జయసింహ హీరో గా వస్తున్న చిత్రం అఖిల. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం నేడు తెలుగు ఫిలిం చాంబర్స్ ఆ కామర్స్ లో జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటుగా నిర్మాత ప్రసన్న కుమార్ మరియు ప్రతాని రామకృష్ణ గౌడ్ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. నిర్మాత ప్రసన్న కుమార్ ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ, మనల్ని మనం ముందు గుర్తించాలి అని చెప్పే శెట్టి చిరంజీవి గారికి ఈ అఖిల సినిమా గుర్తింపు తెచ్చి పెట్టాలి అని కోరుకున్నారు. దర్శకుడు మోహన్ రావు చాలా బాధ్యతగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు అని, ఈ చిత్రంలో నటించిన అందరికీ, అలానే సాంకేతిక నిపుణులకు ఈ సినిమా మంచి పేరు తేవాలి అని అన్నారు.

అయితే ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, లాక్ డౌన్ అనంతరం మొదటి ప్రెస్ మీట్ అఖిల అని, ఈ సినిమా దర్శకుడు మోహన్ రావు, నిర్మాత శెట్టి చిరంజీవి గారు పిలుపు మేరకు రావడం జరిగింది అని తెలిపారు. అయితే ఇటువంటి సినిమాలకు పబ్లిసిటీ చాలా అవసరం అని, చిన్న సినిమా అయినప్పటికీ దీనికి బాగా పబ్లిసిటీ చేసి, ఎక్కువ ధియేటర్స్ లో విడుదల చేయాలి అని కోరుకుంటున్నా అని అన్నారు. అయితే ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీతం, శేఖర్ కెమెరా వర్క్ అదనపు ఆకర్షణ అని, అందరి సపోర్ట్ తో పెద్ద స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తున్నా అని తెలిపారు.

అయితే అఖిల చిత్రం దర్శకుడు మాట్లాడుతూ, సిటీ లో జరుగుతున్న వరుస హత్యల నేపద్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆసక్తిగా కొనసాగుతుంది అని, హీరో, హీరోయిన్ పాత్రలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి అని అన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని నిర్మాత రాజీ పడకుండా నిర్మించబోతున్నారు అని అన్నారు. నిర్మాత శెట్టి చిరంజీవి మాట్లాడుతూ, డైరెక్టర్ మోహన్ రావు గారు చెప్పిన పాయింట్ బావుంది అని, సినిమా అతి త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం అని, ఈ సినిమా కి అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు అని, ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉంది అని తెలిపారు.

అఖిల చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న అక్ష మాట్లాడుతూ, పాత్ర తనకు బాగా నచ్చింది అని, దర్శకుడు బాగా తీస్తారు అనే నమ్మకం ఉంది అని, నిర్మాత ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని, డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ అఖిల సినిమా తనకు ఎంతో పేరు తెస్తోంది అని భావిస్తున్నా అని తెలిపారు. హీరో జయసింహ మాట్లాడుతూ, అఖిల స్టోరీ విన్న వెంటనే బాగా నచ్చేసింది అని, కన్నడలో నేను సినిమా తర్వాత తెలుగులో మొదటి సారిగా ఈ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా అని తెలిపారు.అందరి సపోర్ట్ కావాలి అని, అక్ష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో అందరికీ పరిచయం ఉన్న సీనియర్ నటీనటులు నటించనున్నారు అని హీరో జయసింహ తెలిపారు.

తాజా వార్తలు