యంగ్ హీరో అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా ఇప్పటికే దాదాపు మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా ఎఫెక్ట్ లేకపోయి ఉండి ఉంటే మేలో రిలీజ్ కి రెడీ అయి ఉండేది ఈ సినిమా. కానీ, కరోనా దెబ్బకు రిలీజ్ డేట్ జూన్ కు మారే అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ ఫస్ట్ వీక్ వరకూ ఓవర్సీస్‌లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ పరిస్థితి ఏమిటి.. ప్రస్తుతానికి చిత్రబృందం ఇంట్లో కూర్చుని చేసే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మొత్తానికి రిలీజ్ పై క్లారిటీ లేకపోయినా పోస్ట్ ప్రొడక్షన్ పనుల పై దృష్టి పెట్టారు.
కాగా అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ స్కిల్స్ తో పాటు ఇండస్ట్రీకి వరుస పెట్టి బ్లాక్ బస్టర్స్ ని అందిస్తున్న ప్రొడక్షన్ హౌస్ గా పేరు సంపాదించిన జీఏ2 పిక్చర్స్ పతాకం పై తెరకెక్కుతుండటంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.


