త్రివిక్రమ్ తో సినిమా చేయడంలేదని ట్వీట్ చేసిన అఖిల్

త్రివిక్రమ్ తో సినిమా చేయడంలేదని ట్వీట్ చేసిన అఖిల్

Published on Nov 5, 2013 2:41 PM IST

akhil-akkineni

గత కొద్ది రోజులుగా త్రివిక్రమ్ శ్రీనివాస్, అఖిల్ అక్కినేని తో సినిమా తీయబోతున్నడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అఖిల్ తను స్వతహాగా ఈ విషయంపై వివరణ ఇవ్వడం జరిగింది. తను ఈ విషయంపై తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ” హలో ఫ్రెండ్స్ నేను నా మొదటి సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో చేయబోతున్నని రోమర్స్ వినిపిస్తున్నాయి. నాకు ఆయనతో పనిచేయడం ఇష్టమే. కానీ ఇప్పుడు పనిచేస్తున్నన్నది మాత్రం నిజం కాదు. నేను ఇప్పటివరకు ఏ స్టొరీ ని వినలేదు. ఏ సినిమాకి సైన్ చేయలేదు. ఇది నేను అందరి అనుమానాలు పోవడానికి నేను ట్వీట్ చేస్తున్నాను. నేను ఆయనతో పని చేయడానికి చాలా ఉత్సాహంగానే ఉన్నాను” అని ట్వీట్ చేశాడు. దీనితో ఇప్పుడు మళ్ళి అఖిల్ మొదటి సినిమాకి ఎవరు దర్శకత్వం వహించానున్నారు? అని అందరిలో ఆసక్తి నెలకొంది. మరి అఖిల్ మొదటి సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారని మీరు అనుకుంటున్నారు? మీ సమాధానాన్ని కామెంట్ లో క్రింద రాయండి.

తాజా వార్తలు