నందమూరి బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ సినిమానే అఖండ 2 తాండవం. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు సాయంత్రం నుంచే షోస్ తో మొదలు కానుంది. అయితే ఆల్రెడీ ఏపీలో షోస్ తాలూకా టికెట్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.
కానీ ఊహించని విధంగా నైజాం మార్కెట్ లో మాత్రం ఇప్పటికీ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం అనేది ఒకింత షాకింగ్ అండ్ సస్పెన్స్ గా మారింది. ప్రీమియర్స్ ఇవాళ్టి నుంచే అయినప్పటికీ బుకింగ్స్ తెరుచుకోకపోవడంతో బాలయ్య అభిమానులు కొంచెం నిరాశ గానే ఉన్నారు. మరి ఇవి ఇంకెప్పుడు ఓపెన్ అవుతాయో చూడాలి. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


