నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రం అఖండ 2 తాండవం ఊహించని విధంగా వాయిదా పడింది. ఏపీ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి కానీ చివరి నిమిషంలో ప్రీమియర్స్ క్యాన్సిల్ కావడం ఫ్యాన్స్ గట్టి దెబ్బ అయ్యింది. ఇలా దేశ వ్యాప్తంగా సినిమా ఆగింది.
కానీ బుకింగ్స్ పరంగా మాత్రం అఖండ 2 ఆగలేదు. బుక్ మై షోలో ఇప్పుడు కూడా గంటకి వెయ్యి టికెట్స్ కి పైగా అమ్ముడుపోతూ ట్రెండింగ్ లో నిలిచింది. దీని బట్టి అఖండ 2 కోసం ఆడియెన్స్ ఎలా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహించారు.


