క్లైమాక్స్‌కు సిద్ధమవుతున్న ‘అఖండ 2’

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ‘అఖండ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ‘అఖండ 2’ చిత్ర షూటింగ్‌లో భాగంగా చిత్ర యూనిట్ జార్జియా వెళ్లనుంది.

మే 21 నుంచి ఈ చిత్ర క్లైమాక్స్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే జార్జియాలో బోయపాటి శ్రీను లొకేషన్స్ ఓకే చేశాడు. ఇక ఈ క్లైమాక్స్ షూటింగ్‌లో బాలయ్యతో పాటు పలువురు ఫైటర్స్ కూడా పాల్గొంటారు. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఇక్కడ షూటింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version