గుడ్ బ్యాడ్ అగ్లీ’కి రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్!

గుడ్ బ్యాడ్ అగ్లీ’కి రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్!

Published on Apr 11, 2025 7:35 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన సాలిడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా “గుడ్ బ్యాడ్ అగ్లీ” కోసం అందరికీ తెలిసిందే. మరి అజిత్ కెరీర్లోనే భారీ హైప్ నడుమ వచ్చిన ఈ చిత్రం తమిళ నాట రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ అందుకున్నట్టుగా మేకర్స్ తెలుపుతున్నారు.

వరల్డ్ వైడ్ ఏమో కానీ ఒక్క తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర మాత్రం అజిత్ పాత రికార్డులు తిరగరాసినట్టే తెలుస్తుంది. ఇప్పుడు వరకు విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా హైయెస్ట్ ఓపెనర్ గా ఉంటే దానిని అజిత్ బ్రేక్ చేసి కొత్త నంబర్స్ సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇక నుంచి తమిళనాట మాత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ రికార్డు ఓపెనర్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు