ఎస్ ఎస్ రాజమౌళి మక్కి చిత్రానికి అజయ్ దేవగన్ వాయిస్ ఓవర్


ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెలుగు,తమిళం మరియు మలయాళంలో విడుదలయి భారీ విజయం సాదించిన “ఈగ” చిత్రం హిందీలో “మక్కి” అనే పేరుతో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలన్నీ ముగిసాయి అక్టోబర్ 12న ఉత్తర భారత దేశమంతా విడుదల కానుంది. ఈ చిత్రంలో తారాగణం మొట్టలోకి సుదీప్ మాత్రమే బాలీవుడ్లో తెలిసిన నటుడు గతంలో ఈయన “రణ్” మరియు “ఫూంక్” వంటి చిత్రాలలో కనిపించారు. సమంత “ఏక దీవానా తా” చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించినా అక్కడ తన మార్క్ ని సృష్టించుకోలేకపోయింది. ఈ చిత్రం కోసం బాలివుడ్ అగ్రనటుడు తన గాత్రాన్ని ఇవ్వడానికి ముందుకి వచ్చారు. “అజయ్ దేవగన్ మక్కి చిత్రాన్ని చూశారు అయన చిత్ర టైటిల్స్ సమయంలో గాత్రాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నారు. తెలుగులో ఎస్ ఎస్ రాజమౌళి గాత్రాన్ని ఇచ్చారు. సమంత, నాని మరియు సుదీప్ ప్రధాన పాత్రలు పోషించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.

Exit mobile version