ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఓ ఆసక్తికరమైన సినిమా రెడీ అవుతోంది. మణిరత్నం ఇద్దరు స్టార్ హీరోలను కలిపి ఓ భారీ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా మేము విన్న సమాచారం ప్రకారం అందాల భామ ఐశ్వర్యరాయ్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కానుంది. ప్రస్తుతం చర్చలు మొదటి దశలో ఉన్నాయి. అతి త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
అక్కినేని నాగార్జున, మహేష్ బాబు మరియు మలయాళం స్టార్ ఫహద్ ఇప్పటికే ఈ సినిమాకి సైన్ చేసారని సమాచారం. ఈ సినిమా కనుక పూర్తయితే ఈ దశాబ్దంలో ఇదే పెద్ద స్టార్స్ ఉన్న సినిమా అవుతుంది. మణిరత్నం ఈ సినిమాని నిర్మించనున్నాడు.
ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను కనుక్కునే ప్రయత్నంలోనే ఉన్నాం. తాజా వివరాల కోసం 123telugu.com ని విజిట్ చేస్తూ ఉండండి.