మళ్ళీ ధనుష్, వెంకీ అట్లూరి.. టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారా

మళ్ళీ ధనుష్, వెంకీ అట్లూరి.. టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారా

Published on Jan 19, 2025 1:16 AM IST

మన టాలీవుడ్ నుంచి ఇతర భాషల హీరోలతో సినిమాలు చేసి హిట్స్ కొట్టిన దర్శకుల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కూడా ఒకరు. మరి కోలీవుడ్ నుంచి ధనుష్ తో మలయాళ సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ తో వెంకీ చేసిన రెండు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి హిట్ కాగా ఇపుడు ఈ సినిమాలు కాకుండా ధనుష్ తో మరో సినిమాని వెంకీ అట్లూరి లాక్ చేసుకున్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

దీనితో ఈ వీరి కలయికలో మరో సినిమా లాక్ అవ్వడమే కాకుండా ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్ ని కూడా లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రాన్ని “హానెస్ట్ రాజ్” అనే టైటిల్ తో అదే సితార ఎంటర్టైన్మెంట్స్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ వీరి నుంచే వచ్చిన “సార్” సినిమా తెలుగు సహా తమిళ్ లో కూడా మంచి సక్సెస్ సాధించింది. దీనితో మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు