‘థగ్ లైఫ్’ ట్రైలర్.. కోలీవుడ్ ఆడియెన్స్ పై టాలీవుడ్ ఫ్యాన్స్ రివెంజ్

ప్రస్తుతం కోలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ‘థగ్ లైఫ్’ కోసం అందరికీ తెలిసిందే. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అలాగే మణిరత్నం కలయికలో వస్తున్న రెండో సినిమా ఇది కాగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ లో కొన్ని షాట్స్ ఇపుడు సోషల్ మీడియాలో చర్చకి దారి తీశాయి.

ఆ మధ్య మాస్ మహారాజ రవితేజ సినిమాల్లో హీరోయిన్స్ తో ఏజ్ గ్యాప్ ఇంకా పలు రొమాంటిక్ సీన్స్ విషయంలో తమిళ ఆడియెన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే కమల్ పై సన్నివేశాలు చూసేసరికి మన తెలుగు ఆడియెన్స్ సోషల్ మీడియాలో రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. అయితే ట్రైలర్ కి ఓవరాల్ మంచి స్పందనే వచ్చింది కానీ ఈ సన్నివేశాలు మాత్రం ఊహించని విధంగా మారిపోయాయి.

Exit mobile version