సౌత్ ఇండియాలో బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ అనుష్క. అనుష్క హీరోయిన్ గా తనకొక ప్రత్యేక ముద్ర వేసుకోవడమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను మెప్పించారు. వర్ణ ప్రస్తుతం మూడు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి రాజమౌళి తీస్తున్న ‘బాహుబలి’ అయితే, రెండవది గుణశేఖర్ తీస్తున్న ‘రుద్రమదేవి’, ఇక మూడవది ‘వర్ణ’. సోసియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన వర్ణ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇక నుంచి కత్తి పట్టే సినిమాలు చేయనని చెప్పి అనుష్క అందరినీ షాక్ కి గురి చేసింది.
అనుష్క మాట్లాడుతూ ‘నా మొదటి సినిమా నుంచి దర్శకులు, నిర్మాతలు నా పై నమ్మకంతో మంచి మంచి పాత్రలు ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడుండి సినిమాలు చేయగలుగుతున్నాను. అలా వర్ణ నాకు లభించిన మరో చక్కని అవకాశం. భవిష్యత్తులో ఓ అద్భుతమైన పాత్ర చేసానని గర్వంగా చెప్పుకుంటాను. వర్ణ మంచి లవ్ స్టొరీ. ఇది వరకు రాని కథాంశంతో వస్తోంది. రాంజీ సినిమాటోగ్రఫీ, కిరణ్ ఆర్ట్ సినిమాకి హైలైట్ అవుతాయని చెప్పింది.
చివరిగా మాట్లాడుతూ ‘ వర్ణ, బాహుబలి, రుద్రమదేవి సినిమాలు పూర్తయిన తర్వాత హీరోలతో డాన్సులు చేసే సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఇకపై కత్తి పట్టే సినిమాలు చేయనని’ తెలిపింది. వర్ణ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.