ఆ రెండు సినిమా విజయాలు నా పై మరింత ఒత్తిడిని పెంచాయి : అల్లు అర్జున్

ఆ రెండు సినిమా విజయాలు నా పై మరింత ఒత్తిడిని పెంచాయి : అల్లు అర్జున్

Published on Jul 4, 2012 6:50 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటించిన “జులాయి” చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస హిట్లు సాధించాయి. ఇప్పుడు రాబోయే ‘జులాయి’ చిత్రంతో బన్నీకూడా విజయం సాదించి ఈ సమ్మర్ ని మెగా ఫ్యామిలీకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు జరిగిన విలేఖరుల సమావేశంలో బన్నీ మాట్లాడుతూ ” ‘రచ్చ’ మరియు ‘గబ్బర్ సింగ్’ సినిమాలు సూపర్ హిట్ అవడంతో జులాయి సినిమా కూడా హిట్ అవ్వాలనే ఒత్తిడి తన మీద ఉందన్నారు. తన ‘జులాయి’ చిత్రం ఖచ్చితంగా విజయం సాదిస్తుందన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు”.

ఈ చిత్రం కోసం ఓల్డ్ సిటీలో అల్లు అర్జున్ పై ఒక ప్రత్యేక ప్రోమో సాంగ్ ని చిత్రీకరించారు. తెలుగు చలన చిత్ర రంగంలో మొదటి సారిగా ఈ సినిమా కోసం ఈ తరహ ప్రోమో సాంగ్ ను చిత్రీకరించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించారు.

తాజా వార్తలు