SSMB29: ఆస్కార్స్ కొత్త క్యాటగిరీ.. జక్కన్న నెక్స్ట్ పై పెరిగిన అంచనాలు.!

SSMB29: ఆస్కార్స్ కొత్త క్యాటగిరీ.. జక్కన్న నెక్స్ట్ పై పెరిగిన అంచనాలు.!

Published on Apr 11, 2025 6:30 PM IST

ప్రపంచ ప్రఖ్యాత సినీ అవార్డు ఆస్కార్ వారు లేటెస్ట్ స్టంట్ డిజైన్ క్యాటగిరీని కూడా యాడ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అనౌన్సమెంట్ పోస్ట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి కలయికలో వచ్చిన RRR నుంచి క్రేజీ సీక్వెన్స్ ని పెట్టి అనౌన్స్ చేయడంతో చిత్ర యూనిట్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఈ అవార్డ్స్ 2027 నుంచి వచ్చిన సినిమాలతో మొదలు కానున్నట్టుగా ఆస్కార్ అకాడమీ వారు క్లారిటీ ఇచ్చేసారు.

అయితే ఇపుడు జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. RRR తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా మహేష్ బాబు తోనే అని అందరికీ తెలిసిందే. ఈ సినిమాని కూడా భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆస్కార్ నుంచి వచ్చిన ఈ కొత్త అనౌన్సమెంట్ తో ఇక అందరి కళ్ళు మహేష్, రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ పైనే పడ్డాయి. ఈ చిత్రాన్ని మేకర్స్ ఆల్రెడీ 2027 కి లాక్ చేశారు.

దీనితో ఈ సినిమాలో స్టంట్స్ ఏమాత్రం వర్కౌట్ అయినా ఈ సినిమాతో కూడా గ్లోబల్ లెవెల్లో మహేష్ బాబు రాజమౌళి మోత మోగించడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఆల్రెడీ ఆస్కార్స్ విషయంలో రాజమౌళి కూడా హ్యాపీగా ఉన్నారు. సో మహేష్ బాబు అభిమానులు మాత్రం సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లని మహేష్ పై ఈ సినిమాలో కోరుకుంటున్నారు. మరి చూడాలి ఈ భారీ సినిమా ఎలాంటి ట్రీట్ ఇస్తుంది అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు